పద్మశాలి ఆత్మీయ అభినందన సత్కార సభ - ముఖ్యఅతిథిగా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
విశ్వంభర, హైదరాబాద్:- పద్మశాలి ఆత్మీయ అభినందన సత్కార సభ మరియు ‘OBCల పోరుబాట’ పుస్తక ఆవిష్కరణ (రవీంద్రభారతి) లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, పద్మశాలి, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కులు, సమస్యలు, సాధికారత కోసం సాగుతున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ‘ OBCల పోరుబాట’ పుస్తకం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
పద్మశాలి సమాజం ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, వ్యాపారం, రాజకీయ రంగాల్లో యువత మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులను సత్కరించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహాన్ని నింపవచ్చని అన్నారు.బీసీ వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గూడూరు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే నాయుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఇరవత్ని అనిల్ , పూర్ణచంద్ర రావు, దూడం వెంకటరమణ (తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్) తొలి వెలుగు రఘు,పద్మశాలి సంఘాల ప్రతినిధులు, బీసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.



