ULC భూములపై రేవంత్‌ సర్కార్‌ తీరును తప్పుబట్టిన హరీశ్‌రావు

  • బాధితులను కబ్జాదారులు అంటున్నారు.. రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌

Harish Rao: 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ULC భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారని, అయితే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2008 కంటే ముందు ULCలో ఉన్న భూములంటూ వాటిని మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. భూముల విషయంలో బాధితులుగా ఉన్న వారిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కబ్జాదారులుగా పేర్కొంటోందని విమర్శించారు. ULC భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై స్పష్టత ఇవ్వాలని, బాధితులకు న్యాయం చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

🕒 26 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/harish-rao-criticized-revanth-sarkars-behavior-on-ulc-lands/article-21989