భారీ క్రేన్‌పై సీఎం రేవంత్ రెడ్డి.. మీరాలం చెరువు పనుల పరిశీలన
On
- మీరాలం చెరువు అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
CM Revanth Reddy Meer Alam Cheruvu: హైదరాబాద్‌లోని మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ క్రేన్‌పైకి ఎక్కిన సీఎం.. చెరువులో జరుగుతున్న పనులను దగ్గరగా పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనుల పురోగతి, నిర్మాణ పనుల పరిస్థితి, చెరువు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. చెరువు అభివృద్ధి పూర్తయిన తర్వాత ప్రజలకు మెరుగైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రదేశం అందుబాటులోకి వచ్చేలా పనులను పక్కా ప్రణాళికతో కొనసాగించాలని ఆదేశించారు. సీఎం స్వయంగా భారీ క్రేన్‌పై నుంచి పనులను పరిశీలించడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది.



