మదర్ థెరిస్సా స్ఫూర్తితోనే సామాజిక సేవలు.
- మదర్ థెరిస్సా జయంతి సందర్బంగా వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ. -చేపూరి శంకర్
- భవిష్యత్తులో కూడా మరింత మందికి సేవ చేస్తా.
- . మదర్ థెరిస్సా చారిటబుల్ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్.
విశ్వంభర, వనస్థలిపురం :- మదర్ థెరిస్సా స్ఫూర్తితో నే సామాజిక సేవ చేయడం అలవరుచుకున్నాను అని వనస్థలిపురానికి చెందిన సామాజిక కార్యకర్త, మదర్ థెరిస్సా చారిటబుల్ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్ అన్నారు. బుధవారం మదర్ తెరిస్సా 116వ జయంతిని పురస్కరించుకొని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ బి నాగేందర్, చేపూరి శంకర్ కలిసి మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. సమాజంలో నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరిస్సా చేసిన నిస్వార్థ సేవలు అమూల్యమైనవని, ఆమె సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద బాలింతల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. వారికి పౌష్టికాహారం (తాజా పండ్లు) అందించడానికి ముందుకు వచ్చిన చేపూరి శంకర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విశ్వంభర దినపత్రిక ప్రతినిధితో చేపూరి శంకర్ మాట్లాడుతూ సొసైటీని 2009లో ఏర్పాటు చేసి 150 మంది సభ్యులతో కలిసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్నూల్ వరదల సమయంలో వారికి నిత్యవసర సరుకులు పంపించడం జరిగింది. స్వైన్ ఫ్లూ సమయంలో కూడా ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు గవర్నమెంట్ వారి సహకారంతో 5000 మంది విద్యార్థులకు మెడిసిన్ అందజేశాము. కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు మనిషిని మనిషిని తాకకుండా దూరం దూరం ఉన్నప్పుడుమా సంస్థ ముందుండి 10,000 మంది పైగా టీకాలు వేయించడం, వృద్ధులకు ప్రత్యేకంగా కారులో తీసుకెళ్లి వారికి టీకాలు వేయించారు. 2000 మంది ఉచితంగా కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది.తీవ్రమైన ఎండల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్స్ పంపిణి చేసాము. గత సంవత్సరం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం వల్ల సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచి నిత్యవసర సరకులు పంపిణి చేశారు. భారతదేశంలో తలసేమియా బాధితులు రోజుకు 12,000 మంది మరణిస్తున్నారు. రక్తం కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రతినెల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్ల చేతుల మీదుగా అత్యుత్తమ రక్తదాన అవార్డు 2026 గవర్నమెంట్ చేతుల మీదుగా తీసుకొని చేపూరి శంకర్ స్వయంగా 25 సార్లు రక్తదానం చేసి ఇప్పటివరకు 40 శిబిరాలు ఏర్పాటు చేశారు . యాక్సిడెంట్ అయిన వారికి హాస్పిటల్లో రక్తం అందకపోతే ఆపరేషన్ టైం లో మాకు నిత్యం ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పటల్ నుండి మాకు ఫోన్ కాల్స్ రాగానే తక్షణమే స్పందిస్తాం. రక్తం దొరకకపోతే మేము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుండి ఉచితంగా ప్రజలకు అందజేస్తున్నాం. విద్యార్థులకు, వృద్ధులకు అనాధలకు 50కీ పైగా అన్నదాన కార్యక్రమాలు చేశాము. తలసేమియా బాధితులు ఎవరైనా ఉంటే మా దృష్టికి తెస్తే వారికి ఉచితంగా మెడిసిన్స్, ఉచితంగా బ్లడ్ డోనార్స్ ని ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ ఉచితంగా వారికి అందజేస్తాం. మా యొక్క సంస్థ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆరుసార్లు గవర్నర్ ద్వారా ప్రశంసా పత్రం మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ చేతుల మీదుగా,మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా, మాజీ గవర్నర్ కొనిశెట్టి రోశయ్య చేతుల మీదుగా గౌరవ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ల చేతుల మీదుగాప్రశంసా పత్రాలను అందుకోవడం జరిగింది అని తెలిపారు.



