కౌశిక్ రెడ్డి విషయంలో ముందే నిర్ణయించుకున్నారు: ప్రశాంత్ రెడ్డి
- కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయడంపై ప్రశాంత్ రెడ్డి ఫైర్
Vemula Prashanth Reddy: కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ చర్యలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై చర్చించి తదుపరి చర్యలకు సిఫారసు చేసేందుకు ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే ఎథిక్స్ కమిటీ లేని రోజే కౌశిక్ రెడ్డిని ఆ కమిటీకి రిఫర్ చేయడం చూస్తే ముందే నిర్ణయించుకుని కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు స్పష్టమవుతోందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులకు ‘ఎథిక్స్’ అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని వ్యాఖ్యానించారు. ఎథిక్స్ కమిటీ సభ్యుల నైతిక విలువలను కాపాడేందుకు ఉండాలని, రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు కాదని అన్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు.
కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై చర్చించి తదుపరి చర్యలకు సిఫారసు చేయనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎథిక్స్ కమిటీని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని, సభా వ్యవహారాల్లో నిబంధనలు, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.