అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు తాత్కాలిక బ్రేక్‌

  • అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్‌.. వీసా తేదీల్లో మార్పులు

US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. వీసా అధికారులు కొత్త విధానాలపై శిక్షణ పొందుతున్న నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి వివరాలను ఇకపై మరింత జాగ్రత్తగా పరిశీలించనున్నారు.

అమెరికా ప్రభుత్వం నుంచి లభించే సాయంపై దరఖాస్తుదారు ఆధారపడే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలు ఖరారైన కొందరికి అపాయింట్‌మెంట్లు మార్చుతున్నట్లు ఈమెయిల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త తేదీలను తర్వాత తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వీసా అపాయింట్‌మెంట్లు పూర్తిస్థాయిలో ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభమవుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీంతో అమెరికా వెళ్లేందుకు వీసా కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆందోళన నెలకొంది.

Read More మళ్లీ పెరుగుతున్నఉద్రిక్తత అమెరికా-ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా హైటెన్షన్

🕒 26 Aug 2026 ✍️ Desk

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు తాత్కాలిక బ్రేక్‌

US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. వీసా అధికారులు కొత్త విధానాలపై శిక్షణ పొందుతున్న నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి వివరాలను ఇకపై మరింత జాగ్రత్తగా పరిశీలించనున్నారు.

అమెరికా ప్రభుత్వం నుంచి లభించే సాయంపై దరఖాస్తుదారు ఆధారపడే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలు ఖరారైన కొందరికి అపాయింట్‌మెంట్లు మార్చుతున్నట్లు ఈమెయిల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త తేదీలను తర్వాత తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వీసా అపాయింట్‌మెంట్లు పూర్తిస్థాయిలో ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభమవుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీంతో అమెరికా వెళ్లేందుకు వీసా కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆందోళన నెలకొంది.

🔗 https://www.vishvambhara.com/international/temporary-break-for-us-visa-appointments/article-21987

Related Posts