రైతులను ఆదుకోవాలన్న శ్రద్ధ కూడా లేదు.. చంద్రబాబుపై జగన్ విమర్శలు
- కరువుతో రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: జగన్
YS Jagan Mohan Reddy: రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరువు తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడటం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకోవాలన్న శ్రద్ధ ప్రభుత్వానికి కనిపించడం లేదని జగన్ అన్నారు.
కరువు పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, రైతులకు అవసరమైన సహాయం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులకు అండగా నిలిచి, కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.