అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 

నువ్వు రాజకీయాల నుండి తప్పుకుంటావా.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?

  • మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ.

విశ్వంభర, చండూరు:మున్సిపాలిటీలోని ప్రభుత్వ అతిధి గృహంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవాలను ప్రజలకు వివరించకుండా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా బస్సు షెల్టర్ల కోసం ఎదురుచూస్తున్న చండూరు ప్రజల వారికోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  తమ తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో బస్ షెల్టర్ నిర్మాణం ప్రారంభిస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు అది అవసరం లేదని మాట్లాడటం, దాని నిర్మాణం మొదట పండ్ల బండ్ల దగ్గర నిర్మిస్తామని చెప్పి వారి దగ్గర 12 లక్షలు తీసుకున్నారని ఆరోపించడం, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ డబ్బులు తీసుకున్నారని, వైన్ షాపుల దగ్గర, పండ్ల బండి వారి దగ్గర, ప్రైవేట్ హాస్పిటల్స్ వద్ద, కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర లక్షల రూపాయలు తింటున్నారని, దేవుని దగ్గర ప్రమాణం చేస్తానని మాట్లాడారని, మీ మాట ప్రకారం మేము శనివారం రోజు ఉదయం 9:00 గంటలకు నేను, మున్సిపాలిటీ పాలకవర్గం అందరం మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రమాణం చేస్తామని, మేము డబ్బులు తీసుకున్నట్లు మీరు ప్రమాణం చేయాలని అన్నారు. ఎక్కడైనా ఒక రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే నేను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని... నువ్వు రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా కావడానికి సిద్ధమా? అని మండిపడ్డారు.కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్ మాట్లాడుతూ  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే అని మరిచిపోయి, కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చండూరులో అడుగుపెట్టనివ్వబోమని అన్నారు. పండ్ల బండి వ్యాపారులు, వైన్స్ యాజమాన్యం  ప్రెస్ మీట్ లో పాల్గొని ఎవరికీ ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదని, మున్సిపల్ చైర్మన్ పై అబాండాలు మోపితే సహించమని, మేమందరం శనివారం గుడికి వచ్చి డబ్బులు ఎవరికి ఇవ్వలేదని ప్రమాణం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న, మాజీ సర్పంచ్ కోడిగిరి బాబు, కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, మొగుదాల వెంకన్న, షరీఫ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నబోయిన నాగరాజు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏలే శ్రీను , జూలూరు వెంకటేశం, పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, బొమ్మరబోయిన వెంకటేశం, పున్న సైదులు, సమీర్,బుషిపాక సురేష్, కారింగు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

🕒 18 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/municipal-chairman-dr-kodi-srinivasulu-will-resign-if-found-guilty/article-21811

Tags:  

Advertisement

LatestNews

గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్. 
అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 
మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా  గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ. 
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.
మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే