టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
విశ్వంభర,హైదరాబాద్:-మెదక్ జిల్లాలోని ప్రముఖ, పురాతన దేవాలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున నిధులు కేటాయించి, అవసరమైన సహకారం అందించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, TGLDA చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ టీటీడీ చైర్మన్ BR నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లాలోని వివిధ దేవాలయాల ప్రస్తుత పరిస్థితి, భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనులను టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రత్యేకంగా దేవాలయాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, భక్తులకు వసతి, ఆలయ ప్రాంగణాల అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన నిధులను టీటీడీ తరఫున కేటాయించాలని కోరారు.మెదక్ జిల్లాకు ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని, జిల్లాలోని అనేక పురాతన దేవాలయాలను ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారని వారు తెలిపారు. ఆయా ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ సహకారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.దేవాలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే అవకాశం ఉందని వివరించారు. మెదక్ జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి టీటీడీ నుంచి సాధ్యమైనంత మేర నిధులు మంజూరు చేసి, అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిని సానుకూలంగా స్పందించిన TTD ఛైర్మెన్ సంబంధిత అంశాలపై అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, TGLDA చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ పాల్గొన్నారు.