హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్‌.. ఫేక్‌ సర్టిఫికెట్లతో వైద్యం

  • ఫేక్‌ సర్టిఫికెట్లతో వైద్యం.. హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్‌

Hyderabad Fake Doctors: హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి 11 మందిని అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ఫేక్‌ డాక్టర్‌ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఓ మెడికల్‌ షాప్‌ యజమానిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్లు, వైద్యుల పేర్లతో ఉన్న రబ్బర్‌ స్టాంపులు, నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు, వేలాది మందులు, గ్లూకోజ్‌ బాటిళ్లు, వివిధ వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం నిందితులు రోజుకు సుమారు 50 నుంచి 100 మంది రోగులకు వైద్యం అందిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.50 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్‌ జోన్‌లో ఆరుగురు, జూబ్లీహిల్స్‌ జోన్‌లో ఐదుగురు నకిలీ డాక్టర్లను అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ తెలిపారు. నిందితులపై నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం 11 కేసులు నమోదు చేశారు.

Read More నర్సంపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. రంగంలోకి భారీగా పోలీసు బలగాలు

ముదరాంగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, బోరబండ, రాంగోపాల్‌పేట్‌, దోమల్‌గూడలో ఒక్కో కేసు, చిలకలగూడలో రెండు, ఓల్డ్‌ సిటీలో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ వైద్యుల వ్యవహారంపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

🕒 26 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/11-fake-doctors-arrested-in-hyderabad-for-treating-with-fake/article-21969

Related Posts