పెదవేడులో నిబంధనలకు నీళ్లు.. జాగీర్ భూముల్లో అక్రమ నిర్మాణాల జోరు!

రూ.2–3 లక్షల నెలవారీ లీజు.. అయినా అక్రమ నిర్మాణాల ఆరోపణలు

  • ఆర్ఐ కాజా మోయినుద్దీన్ పరిశీలన.. రెండు మూడు రోజుల్లో కూల్చివేస్తామన్న తహసీల్దార్
  • అన్వర్అధికారుల హామీలు అమలయ్యేనా? గ్రామస్తుల్లో ఉత్కంఠ

విశ్వంభర, చేవెళ్ళ నియోజకవర్గం:షాబాద్ మండలం పరిధిలోని పెదవేడు గ్రామంలో జాగీర్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ అధికారుల తీరుపై గ్రామస్తులు, బాధిత రైతులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.పెదవేడు గ్రామంలోని సర్వే నంబర్లు 2, 4, 5, 6లో సుమారు 8 ఎకరాల భూమి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ భూములను గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ భూమిని యూఆర్‌సీ కంపెనీకి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు కిరాయి చెల్లించే విధంగా లీజుకు కేటాయించినట్లు సమాచారం.
గతంలో నిర్మాణాలు కూల్చివేత.. ఇప్పుడు మళ్లీ జోరు
గతంలో ఇదే భూముల్లో చిన్నపాటి నిర్మాణాలు చేపట్టిన సమయంలో తహసీల్దార్ అన్వర్ స్వయంగా చర్యలు తీసుకుని వాటిని కూల్చివేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం కొంతమంది రైతుల భూముల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు వచ్చి పరిశీలిస్తామని చెబుతున్నారే తప్ప, తక్షణ చర్యలు తీసుకోవడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్డీవోకు వినతిపత్రం
అక్రమ నిర్మాణాలపై గ్రామస్తులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్థానిక ఆర్ఐ కాజా మోయినుద్దీన్ సంఘటనా స్థలానికి వెళ్లి భూములను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే తొలగిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
రెండు మూడు రోజుల్లో కూల్చివేతకు హామీ
అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్ అన్వర్ కూడా స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో వాటిని కూల్చివేస్తామని మీడియా ముందు వెల్లడించినట్లు స్థానికులు తెలిపారు.
అయితే యూఆర్‌సీ కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు చెబుతున్న భూముల్లో నిర్మాణాలు ఏ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి? వాటికి అనుమతులు ఉన్నాయా? లీజు నిబంధనలు ఏమిటి? అనే అంశాలపై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారులు ఇచ్చిన హామీ మేరకు అక్రమ నిర్మాణాలను తొలగిస్తారా? లేక యథావిధిగా నిర్మాణాలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు పెదవేడు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. భూముల లీజు వ్యవహారం, నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

🕒 25 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/in-pedavedu-illegal-constructions-are-rampant-in-jagir-lands/article-21962

Tags:  

Advertisement

LatestNews