మదర్ థెరిస్సా జయంతి సందర్బంగా బాలింతలకు పండ్లు పంపిణీ. -చేపూరి శంకర్
ముఖ్య అతిథిగా పాల్గొన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్
- మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా చేపూరి శంకర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.
విశ్వంభర, వనస్థలిపురం: మదర్ థెరిస్సా 116 వ జయంతిని పురస్కరించుకొని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ బి నాగేందర్, చేపూరి శంకర్ కలిసి మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. సమాజంలో నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరిస్సా చేసిన నిస్వార్థ సేవలు అమూల్యమైనవని, ఆమె సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద బాలింతల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. వారికి పౌష్టికాహారం (తాజా పండ్లు) అందించడానికి ముందుకు వచ్చిన చేపూరి శంకర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు రోగులకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమ నిర్వాహకులు చేపూరి శంకర్ మాట్లాడుతూ.. మదర్ థెరిస్సా జయంతి నాడు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే నిజమైన మానవత్వమని నమ్మి ఈ చిన్న ప్రయత్నం చేశామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని బాలింతల వార్డులను సందర్శించి, సూపరింటెండెంట్ చేతుల మీదుగా రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దామోదర్ రావు ఆర్ఎంఓ సిఎస్, డాక్టర్ రాజీవ్ సింగ్ డివిఎల్ హెచ్ ఓ డి, నర్సింగ్ సూపర్డెంట్ , ఆసుపత్రి వైద్య సిబ్బంది, సందీప్, పి శ్రీశైలం, చేపూరి సందీప్ ఇతర ముఖ్య నాయకులు మరియు రోగుల బంధువులు పాల్గొన్నారు.



