తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి

  • జేసీ ప్రభాకర్‌ రెడ్డిని గ్యాంగ్‌స్టర్‌లా తయారు చేశారు: కేతిరెడ్డి

Ketireddy Peddareddy: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గోవా లిక్కర్‌ అక్రమ సరఫరా, అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలతో కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డి కోరుతున్నారని, అయితే మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌తో కమిటీ వేసి విచారణ చేయించాలని కేతిరెడ్డి సూచించారు.

తాడిపత్రిలో అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని కేతిరెడ్డి ఆరోపించారు. కొన్ని పోలీస్‌ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీస్‌ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్‌’ అని పేరు పెట్టుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్‌ రెడ్డి పేరు పెడితే సరిపోతుందని అన్నారు.

Read More అనంతపురం ఎంఎస్ ప్లైవుడ్ ఫ్యాక్టరీపై వరుస ఆరోపణలు.. అధికారుల తీరుపై ప్రశ్నలు

టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్‌ రెడ్డిని గ్యాంగ్‌స్టర్‌లా తయారు చేశారని కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 24 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అంతం చేస్తామని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సాక్షాత్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రజలకు భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.

🕒 24 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/why-is-chandrababu-lokesh-silent-on-the-anarchy-in-tadipatri/article-21953

Advertisement

LatestNews

భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?