ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..

  • వరుస కథనాలు.. వరుస ఆరోపణలు.. అయినా అధికారుల నుంచి స్పందన కరువు

Bismi Industries Anantapur: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి–సోములదొడ్డి పరిధిలోని బిస్మి ఇండస్ట్రీస్‌కు చెందిన ఎంఎస్‌ ప్లైవుడ్‌ ఫ్యాక్టరీపై జూలై 30, ఆగస్టు 19 తేదీల్లో కార్మికుల భద్రత, పాముకాటు ఘటనలపై కథనాలు ప్రచురితమైనా ఇప్పటివరకు సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఘటన మరువకముందే సుమారు నెలరోజుల వ్యవధిలో మరో కార్మికుడు పాముకాటుకు గురై అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. వరుస ఘటనలు జరుగుతున్నా ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? కార్మికుల రక్షణకు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

మరోవైపు ఫ్యాక్టరీ కమిషనర్‌ రాధాకృష్ణ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తనిఖీలు నిర్వహించారా? నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందన కోసం రిపోర్టర్లు ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా ‘రేపు రా’ అంటూ తప్పించుకున్నట్లు సమాచారం. కార్మికుల ప్రాణాలకు సంబంధించిన అంశంపై ఇలా స్పందించకుండా ఉండటం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read More డీఎస్సీ అక్రమాలపై వైసీపీ పోరు.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు

ఇక జూలై 30, ఆగస్టు 19న కథనాలు వెలువడి సుమారు నెలరోజులు అవుతున్నా జిల్లా కలెక్టర్‌ ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఫ్యాక్టరీలో వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిస్మి ఇండస్ట్రీస్‌ యాజమాన్యం కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, ఫ్యాక్టరీకి ఉన్న అనుమతులు, ఫైర్‌ సేఫ్టీ తదితర అంశాలపై సమగ్ర తనిఖీ నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్‌, ఫ్యాక్టరీ కమిషనర్‌ రాధాకృష్ణ వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

🕒 24 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/350-lives-of-illegals-are-guaranteed-by-the-political-wing/article-21949

Related Posts

Advertisement

LatestNews

తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?
ఉచిత బర్త్, డెత్ సర్టిఫికెట్లకు రూ.40 వసూలు.. అనంతపురం మున్సిపల్ ఆఫీస్‌లో కలకలం