శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
విశ్వంభర్, సిద్దిపేట: పట్టణంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవాలయ డైరెక్టర్ ఆహ్వానం మేరకు ఈరోజు దేవాలయాన్ని సందర్శించిన గూడూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో, శ్రీ సంతోషి మాత అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. అలాగే రైతులందరికీ సమృద్ధిగా వర్షాలు కురిసి, మంచి పంటలు పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ సంతోషి మాతను వేడుకున్నారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులను ఈ సందర్భంగా గూడూరు శ్రీనివాస్ అభినందించారు.