15 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆదాబ్ హైదరాబాద్
On
- రవీంద్రభారతిలో ఘనంగా ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవం
Aadab Hyderabad 15th Anniversary: హైదరాబాద్‌లో ఆదాబ్ హైదరాబాద్ తెలుగు డైలీ న్యూస్ పేపర్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరై ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా V3 న్యూస్, విశ్వంభర తెలుగు దినపత్రిక వ్యవస్థాపకులు, చైర్మన్ డా. కాచం సత్యనారాయణను శాలువాతో ఘనంగా సన్మానించారు.
తెలుగు జర్నలిజం రంగంలో ఆదాబ్ హైదరాబాద్ 15 ఏళ్లుగా కొనసాగిస్తున్న ప్రస్థానాన్ని పలువురు అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, సమాజానికి సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో మీడియా సంస్థల పాత్ర కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆదాబ్ హైదరాబాద్ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



