అమిత్ షా రాజీనామా చేయాలి.. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ధర్నా
- రంగారెడ్డి జిల్లాలో యూత్ కాంగ్రెస్ నిరసన.. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
Telangana Youth Congress: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి సయ్యద్ ఖలీద్ అహ్మద్, కో-ఇన్‌చార్జి కె.ఆర్. భవ్య, జిల్లా ఇన్‌చార్జి సంతోష్ గౌడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండకల్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్‌తో పాటు పలువురు యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.