అయ్యో పాపం.. నిజమైన అమ్మ అనుకుని పరుగు తీసిన దూడ! గుండెల్ని పిండేసే వీడియో

అయ్యో పాపం.. నిజమైన అమ్మ అనుకుని పరుగు తీసిన దూడ! గుండెల్ని పిండేసే వీడియో

  • బొమ్మని చూసి అమ్మనుకున్న అమాయకత్వం.. నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న దృశ్యం

Viral Video: రోడ్డుపై చోటుచేసుకున్న ఓ హృదయాన్ని కదిలించే దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు వెనుక భాగంలో ఆవు చిత్రాన్ని చూసిన చిన్న దూడ.. అది తన తల్లేనని భావించింది. తల్లి ప్రేమ కోసం, ఆకలి తీర్చుకునేందుకు ఆ అమాయక దూడ కదులుతున్న ట్రక్కు వెంట పరుగెత్తింది. ఆ చిత్రంలో ఆవు ఎంతో సహజంగా కనిపించడంతో దూడ దాన్ని నిజమైన ఆవుగా భావించినట్లు కనిపించింది.

ట్రక్కు ముందుకు వెళ్తున్నా దూడ మాత్రం దాని వెంట పరుగులు తీస్తూనే ఉంది. ముఖ్యంగా చిత్రంలో కనిపిస్తున్న పొదుగు భాగాన్ని చూసి పాలు తాగేందుకు పదేపదే ఎగురుతూ ప్రయత్నించింది. వాహనం వేగంగా కదులుతున్నా పట్టించుకోకుండా కేవలం ఆకలి, తల్లి కోసం ఉన్న ఆరాటంతో దూడ చేసిన ప్రయత్నం చూపరులను కదిలించింది. అది ప్రాణం లేని చిత్రం మాత్రమేనన్న విషయం తెలియని ఆ చిన్న జీవి తల్లి కోసం పడిన తపనను చూసి అక్కడున్న వారు చలించిపోయారు.

Read More ఆగస్టులో డీమార్ట్‌కు ఏ రోజు వెళ్తే బెస్ట్? షాపర్లకు ఉపయోగపడే ట్రిక్

ఈ హృదయాన్ని కదిలించే దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు దూడ అమాయకత్వంపై భావోద్వేగ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి పట్ల మూగజీవాలకు ఉండే అనుబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి చూపించిందని కామెంట్లు చేస్తున్నారు. నిజమైన తల్లిని పోలిన చిత్రాన్ని చూసి దాని వెంట పరుగెత్తిన ఆ చిన్న దూడ దృశ్యం ప్రతి ఒక్కరి మనసును తాకుతోంది.

Related Posts