పంచకూట శివాలయంలో బ్రహ్మోత్సవాలు.
చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి వెల్లడి.
విశ్వంభర హనుమకొండ జిల్లా:- ఆత్మకూరు మండలంలో పంచకూట శివాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ. కార్తీక మాస మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం శివాలయంలో బ్రహ్మోత్సవాలు వేద పండితుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.మొదటగా ఉదయం వినాయక పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి గోపూజ ఏకాదశి రుద్రాభిషేకం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. సాయంకాలం శివపార్వతుల కళ్యాణం అట్టహాసంగా నిర్వహించినట్లు చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి తెలిపారు. శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన వితరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో శివాలయ పునర్నిర్మాణం కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి. ప్రధాన కార్యదర్శి రేవూరి తిరుపతిరెడ్డి, గౌరవ అధ్యక్షులు. తోట రఘు, వెంకటేశ్వరరావు ,ఉపాధ్యక్షులు .సాగర్, దేవేందర్ రెడ్డి, సంపత్ ,కిషోర్ కుమార్ ,భగవాన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఎర్ర తిరుపతిరెడ్డి, కార్యదర్శులు కుమారస్వామి, సత్యనారాయణ, తిరుపతిరెడ్డి ,వెంకటేశ్వర్లు ,శ్రీనివాస్ ,సుదర్శన్ ,ప్రభాకర్, సహాయ కార్యదర్శి, జయపాల్ రెడ్డి, శివప్రసాద్, రాజేష్ ,రమేష్, సలహాదారులు రాఘవేందర్ ,సాంబ రెడ్డి, ఆది రెడ్డి, రాజు, సుధాకర్ రెడ్డి, రాజు, మహిళా సభ్యులు. మంజుల, రాణి శ్రీ ,స్రవంతి ,రూప దేవి, భారతి, అన్నపూర్ణ, ఊర్మిళాదేవి, ప్రధాన అర్చకులు. శివ కిరణ్ శర్మ, అర్షకులు రవీందర్ శర్మ, శ్రావణ్ శర్మ, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



