పాతబస్తీ రాజకీయాలకు పదును పెట్టిన 'టైగర్ నరేంద్ర' - కటకం సుభాష్, సీనియర్ జర్నలిస్ట్
నేడు నరేంద్ర 80వ జయంతి
- సమస్యలపై ధైర్యంగా ముందడుగు వేసినందుకే టైగర్ గా పిలుచుకున్న ప్రజలు
- 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర
విశ్వంభర, హైదరాబాద్ :- ఆధిపత్య రాజకీయాల మాటున దాచి ఉంచిన ఒక పోరాట చరిత్ర. 1946లో హైదరాబాద్‌లో ఆలె రామలింగం, ఆలె పుష్పవతిల సంతానంగా సాధారణ కుటుంబంలో జన్మించిన ఆలె నరేంద్ర కుటుంబ విలువల నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి, ఐదు దశాబ్దాల రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక చరిత్రను సృష్టించారు. హైదరాబాద్ పాతబస్తీ రాజకీయ వాతావరణం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత పదునుపెట్టింది. ప్రజలతో నేరుగా కలవడం, సమస్యలపై దూకుడుగా స్పందించడం, రాజకీయ ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కోవడం ఆయన స్వభావం. ఆ స్వభావమే ప్రజలుటైగర్ నరేంద్ర అని పిలుచుకునేలా చేసింది. టైగర్ నరేంద్ర అనేది ఒక ముద్దుపేరు కాదు. ప్రజల సమస్యలపై ఆయన చూపిన ధైర్యం, రాజకీయ ప్రత్యర్థుల ముందు వెనుకడుగు వేయని నైజానికి ప్రతీక. పాతబస్తీ రాజకీయాల నుంచి ఎదిగి ఆర్ఎస్ఎస్, జనసంఘ్, బిజెపి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదాన్ని బీజేపీ నాయకత్వం ద్వారా ఒప్పించి, చెప్పించిన ఘనత నరేంద్ర కే దక్కుతుంది. ఐనప్పటికీ 2000 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ మళ్లీ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్రం కోసం మరింత స్పష్టమైన రాజకీయ పోరాటం అవసరమని ఆలె నరేంద్ర తన పుట్టిన నేల ఆకాంక్షల కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అంటే నరేంద్ర, నరేంద్ర అంటే బీజేపీ అనే విధంగా ఎదిగి తానే కర్త, కర్మ, క్రియలా ఉన్న పార్టీ తెలంగాణ పట్ల అనుసరిస్తున్న రాజకీయ వైఖరిని విభేదించి ఆయన బీజేపీని విడిచి తెలంగాణ కోసం ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే ఆయన రాజకీయ జీవితానికి అసలు ప్రత్యేకతను తెచ్చింది. దాని కోసమే తెలంగాణ సాధన సమితి ఆవిర్భావం. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నిర్మించడం కోసం టీఆర్ఎస్ లో తన పార్టీని విలీనం చేసి ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేశారు. నరేంద్ర రాజకీయ అనుభవం, ప్రజా పరిచయం, తెలంగాణపై ఆయనకున్న రాజకీయ అవగాహన, తెలంగాణ ఉద్యమానికి రెట్టింపు బలాన్ని చేకూర్చాయి. తను నమ్మిన విలువల కోసం, తెలంగాణ సాధన కోసం కఠినమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రత్యేక తెలంగాణ లక్ష్యాన్ని మరువని తన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తాయి. భారతదేశ స్వాతంత్ర్యానికి సంవత్సరం ముందు జన్మించిన ఆలె నరేంద్ర ప్రత్యేక తెలంగాణ సాకారం అవ్వడానికి నెలన్నర ముందు నిష్క్రమించారు. ఆ చరిత్రలో ఆలె నరేంద్ర అధ్యాయం కూడా ఒక ప్రధాన భూమిక.
.....ఆధిపత్య కథనాల మాటున కనుమరుగైన చరిత్ర....
చరిత్రలో ఒక ఉద్యమం విజయవంతమైన తరువాత, ఆ విజయానికి సంబంధించిన ప్రధాన కథనం కొద్దిమంది నాయకుల చుట్టూ కేంద్రీకృతమవుతుంది. ఆ కోణంలో ఆలె నరేంద్ర రాజకీయ జీవితం ఆధిపత్య రాజకీయ కథనాల మాటున కనుమరుగైన ఒక ముఖ్యమైన చరిత్రగా వర్ణించవచ్చు. ప్రజలు ప్రేమగా టైగర్ నరేంద్ర అని పిలుచుకున్న ఆయనను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా భవిష్యత్తు తరాలకు టైగర్ నరేంద్ర ఇచ్చే స్పూర్తిగా చూడాలి. నమ్మిన లక్ష్యం కోసం ధైర్యంగా నిలబడడం, పదవి కంటే ప్రజా లక్ష్యం గొప్పదని, విభేదాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలని, విజయంతో పాటు ఓటమిని కూడా స్వీకరించాలని టైగర్ నరేంద్ర ఒక ముగింపు కాదు, ఒక స్ఫూర్తిగా నిలిచారు.మనిషి జీవితం ఎంతకాలం సాగిందన్నది పక్కన పెడితే అతను నమ్మిన లక్ష్యం కోసం ఎంత ధైర్యంగా జీవించాడన్నదే టైగర్ నరేంద్ర జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. టైగర్ నరేంద్ర ఆ పేరు వెనుక ఉన్న అసలు అర్థం గర్జన కాదు.భయపడకుండా ముందుకు సాగడం, పదవి పోతుందేమోనని భయపడకుండా నిర్ణయం తీసుకోవడం, విమర్శలు వస్తాయేమోనని వెనక్కి తగ్గకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం, రాజకీయ పరిస్థితులు మారినా ప్రజా జీవితాన్ని కొనసాగించడం, అదే ఆయన జీవితంలో నుంచి భవిష్యత్తు తరాలు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. అందుకే ఆలె నరేంద్ర జీవితాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన సందేశం ఇదే. లక్ష్యం గొప్పదైతే మార్గంలో వచ్చే కష్టాలకు భయపడకండి, పదవి కోసం కాదు ప్రజల కోసం పనిచేయండి, చరిత్రలో పేరు కోసం కాదు చరిత్రలో మార్పు కోసం పోరాడండి, టైగర్ నరేంద్ర జీవితం నుంచి స్ఫూర్తి పొందే ప్రతి యువకుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి పోరాటం చేసిన ప్రతి అడుగు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ నిజాయితీగా వేసిన అడుగు చరిత్రలో ఎప్పటికీ వృథా కాదు.ఆయన ధైర్యం, ప్రజా నిబద్ధత, పోరాట స్ఫూర్తి యువతకు మార్గదర్శకంగా నిలవాలని మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుతుంది. ఈ నెల 20వ తేదీ గురువారం టైగర్ నరేంద్ర జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మన ఆలోచన సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.