ఇటుకలపల్లి పోలీసుల గ్రేట్ జాబ్.. చోరీ కేసును చిటికెలో ఛేదించిన సూపర్ టీమ్

  • షాబాష్ ఇటుకలపల్లి ఖాకీలు.. రికార్డు సమయంలో నిందితుల అరెస్ట్, రికవరీ

Itukalapalli Police: అనంతపురం జిల్లా ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదైన వెంటనే దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుల ఆచూకీని గుర్తించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం సుమారు 7:30 గంటలకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఓ ఇంట్లో గత నెల 17న సుమారు 156 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందడంతో ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులు చూపిన చొరవ, సాంకేతిక ఆధారాల వినియోగం ఫలించడంతో నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయగలిగారు.

Read More ఆస్తి కోసం అత్తను హత్య చేసిన కోడలు..  సహజ మరణంగా చిత్రీకరించిన కేసు ఛేదించిన తుంగతుర్తి పోలీసులు

నిందితుల నుంచి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, ఒక మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చోరీకి గురైన బంగారంలో ఇంకా సుమారు 91.846 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మిగిలిన ఆభరణాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చోరీ కేసులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో ఇటుకలపల్లి పోలీసుల వేగవంతమైన దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమన్వయం కీలకంగా పనిచేశాయి. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న పోలీసుల పనితీరును స్థానికులు అభినందిస్తున్నారు.

🕒 21 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/kudos-to-the-itaklapalli-police-who-caught-the-accused-with/article-21924

Advertisement