వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నందుకే బడ్డీకొట్టు ధ్వంసమా?.. జగన్‌ను వేడుకున్న వృద్ధ దంపతులు

  • కొడుకు సరిహద్దుల్లో ఆర్మీ జవాన్.. స్వగ్రామంలో వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కరువా?

Vijayanagaram News: వైఎస్సార్‌ను ఆరాధించడమే ఆ వృద్ధుడి పాపమా? ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్ చేయించుకుని తన ప్రాణాలను కాపాడిన వైఎస్సార్‌పై అభిమానంతో ఆయన ఫొటోను బడ్డీకొట్టులో పెట్టుకున్నందుకే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విజయనగరం జిల్లా రేగిడి మండలానికి చెందిన వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా బడ్డీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తమ జీవనాధారమైన షెడ్డును ధ్వంసం చేశారని, దీంతో తమ కుటుంబానికి ఉపాధి లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఎన్నో ఏళ్లుగా అండగా ఉన్న బడ్డీకొట్టును ఒక్కసారిగా నేలమట్టం చేయడంతో వృద్ధాప్యంలో తాము ఎలా బతకాలని బాధిత దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వైఎస్సార్ తమకు ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేయించి ప్రాణం నిలిపారని, అందుకే ఆయనపై ఉన్న అభిమానంతో ఫొటో పెట్టుకున్నామని చెబుతున్నారు. ఆ ఫొటో పెట్టుకోవడం, వైఎస్సార్‌ను అభిమానించడం తప్ప తాము ఎలాంటి తప్పు చేయలేదని వారు వాపోతున్నారు. రాజకీయ కక్షతో తమ జీవనాధారాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read More నేడు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

మరోవైపు తమ కుమారుడు దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తూ దేశానికి సేవ చేస్తున్నాడని బాధిత వృద్ధ దంపతులు తెలిపారు. కొడుకు దేశాన్ని కాపాడుతుంటే.. స్వగ్రామంలో తమకు రక్షణ లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు. తమ జీవనాధారాన్ని తిరిగి కల్పించడంతో పాటు జరిగిన ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

🕒 19 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/elderly-couple-begged-jagan-not-to-destroy-buddy-kottu-for/article-21858

Tags: