పొంగులేటిపై పాడి కౌశిక్‌రెడ్డి ఫైర్‌.. “పొంగి పడితే వంగి దండాలు పెట్టాల్సిందే

  • రూ.20 కోట్లతో ఇళ్లు నిర్మించాం.. కనీస వసతులు లేవు: కౌశిక్‌రెడ్డి

Padi Kaushik Reddy: కమలాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వ్యవహారంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి “పొంగి పొంగి పడితే.. వంగి వంగి దండాలు పెట్టాల్సి వస్తుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్ల తర్వాత కేసీఆర్‌ అధికారంలోకి రావడం ఖాయమని కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్‌లో గత కేసీఆర్‌ ప్రభుత్వం రూ.20 కోట్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించిందని, అయితే ప్రస్తుతం ఆ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇద్దరు మంత్రులు ఆఘమేఘాల మీద ప్రారంభించి వెళ్లిపోయారని, అయితే అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రొసీడింగ్‌ కాపీలు ఇవ్వలేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఇళ్లను ప్రారంభించడం మాత్రమే కాకుండా లబ్ధిదారులకు అధికారికంగా కేటాయింపు పత్రాలు అందించి, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Read More నర్సంపేటకు కేసీఆర్ పయనం.. అడుగడుగునా ఘన స్వాగతం

గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు కనీస వసతులు కల్పించకుండా ప్రారంభోత్సవాలకే పరిమితం కావడం సరికాదని కౌశిక్‌రెడ్డి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్‌ కాపీలు అందించాలని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా తక్షణమే కల్పించాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులకు ఇళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని, పేదలకు నిర్మించిన ఇళ్లను వారికి అందించి వారి సమస్యలను పరిష్కరించాలని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. కమలాపూర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ కాపీలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

🕒 21 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/padi-kaushik-reddy-fire-on-ponguleti-if-it-overflows-you/article-21929

Advertisement