మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల.. మాట మీద నిలబడాలి. -మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
ప్రమాణానికి రావాలి.
- ప్రమాణానికి రాకపోతే మునుగోడు నియోజకవర్గం ప్రజలు నిన్ను నమ్మరు, నీ మాటలను నమ్మరు...
విశ్వంభర, చండూరు: ప్రభుత్వ వ్యతిరేకత మీద గత సోమవారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో చండూరు చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో బస్సు షెల్టర్ మొదట పండ్ల బండ్ల దగ్గర కడతామని చెప్పి తర్వాత మరొకచోట కడుతున్నారని, ఆ పండ్ల బండ్ల షాపు వాళ్లను బెదిరియ్యగానే తల ఒకటి, రెండు చొప్పున మొత్తం 12 లక్షలు అంటుకున్నారని, వీళ్లు వైన్ షాపులు, పండ్ల షాపులు, హాస్పిటల్స్, కాంట్రాక్టర్లను, రియల్ ఎస్టేట్ వాళ్లను ఎవరిని వదిలిపెడతలేరని, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒకవేళ ఇదే అబద్ధం అనుకుంటే గుడి కాడికి పోయి ప్రమాణం చేస్తా అని అన్నారని, దానికి మంగళవారం రోజు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు పై వ్యాపారస్తులందరిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను గానీ, మా పాలకవర్గంగాని ఏ ఒక్కరి దగ్గరైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నానని గాని, అవినీతి చేస్తున్నానని గాని నిరూపిస్తే రాజీనామా చేస్తానని తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట ప్రకారం శనివారం నాడు శిర్ధపల్లి రోడ్డున గల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 09:00 గంటలకు ప్రమాణం చేయడానికి రావాలని తెలిపారు. నేను డబ్బులు తీసుకున్నానని వారు ప్రమాణం చేయాలి, నేను డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తానని, అదే విధంగా మీరు ఎవరి మీద అయితే అభియోగాలు మోపారో అట్టి వ్యాపారస్తులు కూడా కోడి శ్రీనివాసులుకు గాని, కౌన్సిలర్ల కుగాని ఒక రూపాయి ఇవ్వలేదని ప్రమాణం చేస్తారని తెలిపారు. మీరు తప్పనిసరిగా మాట మీద నిలబడతారని, ఈ ప్రమాణానికి వస్తారని వేయికళ్లతో ఎదురు చూస్తామని అన్నారు. ఒకవేళ మీరు రాకపోతే మిమ్మల్ని మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఎవ్వరు నమ్మరని, మీరు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకొని మాకు క్షమాపణ చెప్పాలని అన్నారు.