సత్యదేవుని సన్నిధిలో మళ్లీ పెళ్లిళ్లు.. 9 జంటల వింత నిర్ణయం
- పెళ్లయి ఏళ్లు గడిచినా.. మళ్లీ పెళ్లి చేసుకున్న 9 జంటలు
Annavaram Satyanarayana Swamy Temple: కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. గతంలో వివాహమైన 9 జంటలు మరోసారి పెళ్లి చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన వివాహాల్లో దోషాలు ఉన్నాయని, వాటి కారణంగానే కుటుంబాల్లో కష్టాలు, చికాకులు ఎదురవుతున్నాయని సిద్ధాంతి చెప్పడంతో మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు దంపతులు తెలిపారు. మరోసారి పెళ్లి చేసుకుంటే కుటుంబంలో ఉన్న కష్టాలు, సమస్యలు, దోషాలు తొలగిపోతాయని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ఈ 9 జంటల్లో మూడు జంటలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందినవిగా, మిగిలిన ఆరు జంటలు ఆనందపురం మండలానికి చెందినవిగా గుర్తించారు. పెళ్లయిన తర్వాత కూడా కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా మళ్లీ వివాహం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సత్యదేవుని సన్నిధిలో ఈ జంటలు మరోసారి వివాహం చేసుకోవడంతో ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.