సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స
- షావుకారు జానకి ఆరోగ్యంపై ఆందోళన.. ICUలో వైద్యుల పర్యవేక్షణ
Shavukaru Janaki: సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆమె చేరినట్లు సమాచారం. గత రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆమెను ICUకి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. 95 ఏళ్ల షావుకారు జానకి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
1950లో విడుదలైన ‘షావుకారు’ సినిమాతో జానకి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా పేరే ఆమెకు షావుకారు జానకిగా గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కోసం అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.