కొండా కుటుంబాన్ని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి

  • కొండా కుటుంబానికి వ్యతిరేకంగా నేతల తీర్మానం

Konda Surekha: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కొండా సురేఖ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కొండా వ్యతిరేక వర్గానికి చెందిన నేతలు తీర్మానం చేసి టీపీసీసీకి పంపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు, ఇతర కాంగ్రెస్‌ నాయకులకు మధ్య పలు సందర్భాల్లో విభేదాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాలని ఆమె వ్యతిరేక వర్గం నేతలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు నిన్న ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. సమావేశంలో కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

Read More శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయానికి ప్రముఖుల రాక

తీర్మానాన్ని టీపీసీసీకి పంపినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. కొండా కుటుంబం వ్యవహారశైలిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అసమ్మతి వర్గం నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్‌పై టీపీసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

🕒 21 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/konda-family-should-be-suspended-from-congress/article-21914

Advertisement