శక్తి స్కీమ్‌లోకి వద్దు.. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
పాలిటెక్నిక్ విలీనం వద్దు.. విద్యార్థుల నిరసన ఉధృతం
Polytechnic Students: పాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారేనని, తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను పూర్తి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఇప్పుడు తమను శక్తి స్కీమ్‌లోకి తీసుకొస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.
తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రెండు, మూడు రోజులుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పట్టించుకునే వారు ఎవరూ లేరని, తమ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్‌లో విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాము రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు, పోలీసులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే తమ చదువు, భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలపై మాత్రం ఎవరూ ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్‌లో విలీనం చేయకుండా ప్రస్తుత విద్యా విధానాన్ని కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు.