ప్రకటనలకే పరిమితమైన అభివృద్ధి.. బోయలపల్లి బడిలో రెండు గదుల్లో ఐదు తరగతులు

  • బోయలపల్లి పాఠశాలలో మౌలిక వసతుల కొరత.. ఒకే గదిలో మూడు తరగతులు

Boylapalli Government School: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోయలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కొరత విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారింది. పాఠశాలలో కేవలం రెండు తరగతి గదులు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా.. 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 28 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీంతో రెండు గదుల్లో ఒక గదిలో రెండు తరగతులు, మరో గదిలో ఏకంగా మూడు తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే గదిలో వేర్వేరు తరగతులకు చెందిన విద్యార్థులకు ఒకేసారి బోధించడంతో పాఠాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, డెస్కులు కూడా లేకపోవడంతో నేలపైనే కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఉపాధ్యాయులు, ఫర్నిచర్‌ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనీస మౌలిక వసతులు కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్థులు అంటున్నారు.

Read More ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్

కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పేపర్‌ ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని, గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మాత్రం దృష్టి కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బోయలపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన బెంచీలు, డెస్కులు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

🕒 20 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/ad-limited-development-boyalapally-school-has-five-classes-in-two/article-21902