చెట్లు పెంచుదాం.! ఎల్ నినోను అధిగమిద్దాం..
- ప్రిన్సిపాల్ అర్చనా రెడ్డి
విశ్వంభర, ఇనుగుర్తి: మొక్కలు నాటి చెట్లను పరిరక్షిస్తేనే ఎల్ నినో వంటి విపత్తులను అధిగమించవచ్చని ప్రిన్సిపాల్ గంజి అర్చన రెడ్డి అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి లోని విజ్ఞాన్ హై స్కూల్ ఆవరణంలో కేసముద్రం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,విద్యార్థులతో పాటు లైన్స్ క్లబ్ ప్రతినిధులు 150 మొక్కలను నాటారు. ప్రిన్సిపల్ అర్చన రెడ్డి మాట్లాడుతూ, హరితహారం ప్రకృతి పరిరక్షణకు మహత్తర ఉద్యమమని చెట్లు గాలి కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచి ప్రాణవాయువును అందిస్తాయని చెప్పారు.అడవులు తగ్గి వాతావరణం లో ఉష్ణోగ్రత పెరగడం వలన 'ఎల్ నినో ' కు దారితీస్తుందని ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు."ఒక్క మనిషి -ఒక్క మొక్క" అనే నినాదంతో మొక్కలు నాటడం వలన ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. తమ పాఠశాలను ఎంచుకొని మొక్కలు నాటినందుకు లయన్స్ క్లబ్ కు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రిన్సిపల్,పాఠశాల బృందం కలిసి క్లబ్బు ప్రెసిడెంట్ యర్నం శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజు, కోశాధికారి మదిపెద్ది వెంకటేష్ లను ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో యర్నం నరేష్, ఉపాధ్యాయులు వెనగండ్ల చంద్రమోహన్, తోట అనిత, బోళ్ళ సుజాత, పింగిలి రమాదేవి, కారంపూరి అనూష, ఉడుత శ్వేత, కదిర రమ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.