అసెంబ్లీ అవమానంపై లక్ష్మీపార్వతి బహిరంగ సవాల్.. ఆ రికార్డులు బయటపెట్టగలరా?
- నా క్యారెక్టర్‌ను దెబ్బతీసింది మీ భర్త, కొడుకే!".. భువనేశ్వరికి లక్ష్మీపార్వతి కౌంటర్ బాంబ్!
- రాజకీయ లబ్ధి కోసమే భువనేశ్వరిని ఉపయోగిస్తున్నారు.. నారా లోకేష్, బాబుపై లక్ష్మీపార్వతి ధ్వజం!
Nandamuri Lakshmi Parvathi: నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో స్పందించారు. భువనేశ్వరి మాట్లాడుతున్నదంతా పచ్చి అబద్ధమని ఆమె విమర్శించారు. తన వ్యక్తిత్వం, క్యారెక్టర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది ఆమె భర్త, కుమారుడేనని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును ఉపయోగించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేయడానికి బదులుగా, అలాంటి ప్రచారం చేసిన వారినే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో తనను అవమానించారనే ఆరోపణలను కూడా లక్ష్మీపార్వతి ఖండించారు. నిజంగా అలాంటి ఘటన జరిగి ఉంటే ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ రికార్డులను బయటపెట్టి ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. శాసనసభలో అవమానం జరిగిందని నిరూపిస్తే తాను అంగీకరిస్తానని, కానీ సానుభూతి కోసం అసత్య ప్రచారం చేయడం ప్రజలు నమ్మరని అన్నారు. మొదటి నుంచి కూడా నారా భువనేశ్వరిని రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె భర్త ఉపయోగించారని, ఇప్పుడు అదే విధానాన్ని ఆమె కుమారుడు కూడా కొనసాగిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.