బేతోల్ గ్రామంలో చోరీ.. బంగారం, వెండి, నగదు అపహరణ

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోల్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గయిని వెంకన్న ఇంటి తాళాలు, తలుపులు పగులగొట్టి నాలుగు తులాల బంగారం, 54 తులాల వెండి ఆభరణాలు, రూ.44 వేల నగదును అపహరించారు. బాధితులు వెంకన్న, యాదమ్మ దంపతులు నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లగా, తిరిగి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం కొరివి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కొరివి ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/stolen-gold-silver-cash-embezzlement-in-betol-village/article-20514

Tags:  

Advertisement

LatestNews

చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం
తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.
హైడ్రా  కార్యాలయంలో స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు.
ఆర్కే పురం లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 
శ్రీ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్