గొల్లగుప్పలో కలకలం.. క్లోరోక్విన్ మాత్రల ఘటనలో పెరుగుతున్న బాధితులు

గొల్లగుప్పలో కలకలం.. క్లోరోక్విన్ మాత్రల ఘటనలో పెరుగుతున్న బాధితులు

  • వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండొద్దు.. అధికారులకు మంత్రి ఆదేశాలు

Bhadrachalam Area Hospital: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోక్విన్ మాత్రల పంపిణీ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో మొత్తం 71 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. మాత్రల డోస్ ఎక్కువ కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

అస్వస్థతకు గురైన బాధితులను వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు అందుతున్న వైద్య సేవలు, తాజా పరిస్థితిపై కలెక్టర్ దినేష్‌కుమార్ మంత్రి సత్యకుమార్‌కు వివరించారు.

Read More పోలీసు సిబ్బంది పిల్లల ప్రతిభకు ప్రోత్సాహం.. పురస్కారాలు అందించిన ఎస్పీ జగదీష్

బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్షించారు. చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన అన్ని రకాల మందులు, వైద్య సదుపాయాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన అత్యవసర వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్లోరోక్విన్ ఘటన నేపథ్యంలో గొల్లగుప్పతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఆందోళన నెలకొంది.