పోలీసు సిబ్బంది పిల్లల ప్రతిభకు ప్రోత్సాహం.. పురస్కారాలు అందించిన ఎస్పీ జగదీష్

  • లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించండి.. విద్యార్థులకు ఎస్పీ జగదీష్ పిలుపు

Anantapur News: అనంతపురం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పోలీసు సిబ్బంది పిల్లలకు ఘనంగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 109 మంది విద్యార్థులకు జిల్లా ఎస్పీ పి. జగదీష్, IPS పురస్కారాలు అందించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. మొత్తం రూ.6.35 లక్షల ప్రోత్సాహక నగదును విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించే సిబ్బంది పిల్లలు చదువుల్లో రాణించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి విద్యార్థులు మరింత పట్టుదలతో చదవాలని సూచించారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ లక్ష్యంపై దృష్టి పెట్టి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Read More శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. నాగభూషణం, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘం అడ్హక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సూర్య కుమార్, గాండ్ల హరినాథ్, లక్ష్మినారాయణ, సరోజ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కార్యక్రమానికి హాజరై తమ పిల్లలకు పురస్కారాలు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థులు చదువుల్లో రాణించేలా ప్రోత్సాహం లభిస్తుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

🕒 19 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/sp-jagdish-who-gave-encouragement-awards-to-children-of-police/article-21856

Tags: