దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి.. ఇడుపులపాయలో జగన్ నివాళులు

దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి.. ఇడుపులపాయలో జగన్ నివాళులు

  • తండ్రి వైఎస్సార్‌కు నివాళులర్పించిన జగన్.. వెంట భారతి, విజయమ్మ

YS Jagan: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు.

జగన్‌తో పాటు ఆయన భార్య వైఎస్ భారతి, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఇడుపులపాయకు చేరుకుని ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ప్రతి ఏడాది వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Read More అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం

ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి ఆయనను స్మరించుకున్నారు. వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నేతలు ఆయన సేవలను కొనియాడారు. దీంతో ఇడుపులపాయలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.