హారన్ కొట్టాడని హత్య.. నిందితులకు పోలీసుల ట్రీట్‌మెంట్ వైరల్

హారన్ కొట్టాడని హత్య.. నిందితులకు పోలీసుల ట్రీట్‌మెంట్ వైరల్

  • హారన్ విషయంలో గొడవ.. కత్తులతో దాడి చేసి యువకుడి హత్య

Yash Mittal, Murder Case: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హారన్ కొట్టిన విషయంలో జరిగిన చిన్న గొడవ చివరకు హత్యకు దారితీసింది. ట్రాక్టర్ ఏజెన్సీ యజమాని యశ్ మిట్టల్‌ (27)పై నలుగురు యువకులు కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన యశ్ మిట్టల్‌ మృతి చెందడంతో ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హారన్ కొట్టిన విషయంపై మొదలైన వివాదం క్రమంగా తీవ్ర రూపం దాల్చిందని తెలుస్తోంది. నలుగురు యువకులు యశ్ మిట్టల్‌పై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్రపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు.

Read More రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య 

ఇదిలా ఉండగా.. నిందితులను పోలీసులు సంకెళ్లు వేసి రోడ్డుపై తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితులను ప్లాస్టిక్ పైపులతో కొడుతూ తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్య కేసులో నిందితులను పోలీసులు ఈ విధంగా తీసుకెళ్లడంపై చర్చ జరుగుతోంది. అయితే వీడియోలో కనిపిస్తున్న చర్యలకు సంబంధించి పోలీసుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది.