ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన ప్రగతి.
చెరువులను తలపిస్తున్న ప్రధాన వీధులు.
విశ్వంభర న్యూస్ : - కేశంపేట మండలం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా కాలనీలు,వార్డులు అన్ని నీటితో నిండి నడవడానికి ఇబ్బంది కరంగా మారింది.కేశంపేట మండలంలో పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలోని 1వ వార్డులో రాత్రి కురిసిన వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి.ఇవే కాకుండా పోమాల్ పల్లిలో కూడా వీధులన్నీ నీటి మయమయ్యాయి వర్షం నీటికి తోడు మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో పాదాచారులు,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మురుగునీటిలోని నడుచుకుంటూ ఇళ్లలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని ప్రజలు ఆవేదన చెందారు.నీరు నిలువ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నట్లు గ్రామస్తులంటున్నారు. ఇకనైనా ప్రత్యేక అధికారులు స్పందించి గ్రామాల్లో ప్రధాన రొడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని కోరుతున్నారు.