కాంగ్రెస్ అంటేనే సంక్షేమం,అభివృద్ధి - పున్న గణేష్ నేత
1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు అమోఘం
విశ్వంభర,(ఎల్బీనగర్ ) శ్రీ రామకృష్ణాపురం డివిజన్ :- మహేశ్వర నియోజకవర్గం శ్రీ రామకృష్ణాపురం డివిజన్ అధ్యక్షులు పున్న గణేష్ నేత, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి , టీపీసిసి సభ్యులు దేప భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 1000 రోజుల్లో ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు డివిజన్ల అధ్యక్షులు పున్న గణేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్ లు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత విద్యుత్,రేషన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగాలు,ఇందిరమ్మ ఇండ్లు,సన్న బియ్యం,మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇలాంటివి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. వెయ్యి రోజుల పరిపాలనలో హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ, అందులో భాగంగానే 1000 రోజుల సంబరాలు జరుపుకుంటున్నాము. బి ఆర్ ఎస్ పార్టీ పది సంవత్సరాల ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చకుండా మోసం చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ, అర్హులైన వారికి రేషన్ కార్డుల పంపిణీ చేసి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఉనికిని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న గులాబీ నేతలు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టు అని చెప్పిన కేసీఆర్ , కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ స్థాయిలోని ప్రముఖ కంపెనీలో నగరానికి వస్తుంటే తట్టుకోలేకపోతున్న గులాబీ నేతలు. గ్రీన్ సిటీ, వ్యతిరేకిస్తున్న గులాబీ నేతలు. నగరంలో స్టీల్ బ్రిడ్జిలు రోజులో నీటి సదుపాయం మౌలిక వసతులు కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ప్రజాసంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించుకున్న పబ్బం కడుకోవాలని చూస్తే బిఆర్ఎస్ పార్టీని ప్రజల క్షమించరన్నారు. 22ఎ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవడం కొరకు అని తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్ రాష్ట్ర బీసీ నాయకులు గట్ల రవీంద్ర, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, దుర్గా ప్రసాద్,రామకృష్ణగౌడ్, జెల్ల జగన్నాథం, పెద్ద ఊర సైదులు, వెంకటరమణారెడ్డి, యాదవ రెడ్డి, మహ్మద్ దుబ్బాక శేఖర్, ఎల్లన్న బిక్షపతి గౌడ్, కృష్ణా రావు, ఆనంద్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



