ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

విశ్వంభర, సరూర్ నగర్ :-రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కష్టార్జితం తో కొనుకున్న ఆస్తులతో చెలగాటమాడుతుంది అని మహేశ్వరం నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు.  మాజీ మంత్రి , మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి  ఆదేశాల మేరకు ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ లో పలు కాలనీలలో ప్లాట్లు, ఇండ్ల ను 22 ఏ నిషేధిత జాబితా లో చేర్చడం పైన బి ఆర్ ఎస్  పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం  సరూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయం  వద్ద ధర్నా చేపట్టి  ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.తహసిల్దార్ కార్యాలయంలో   వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ  22 ఏ నుంచి తొలగించాలని లేని పక్షం లో బి ఆర్ ఎస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరాల నిమిత్తం వారి ఆస్తుల వారు అమ్ముకోకుండా 22ఏ ను తీసుకువచ్చి ప్రజలపై రుద్ది వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి కి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పేదల ఇండ్లను హైడ్రా పేరిట కూల్చివేసి, మధ్య తరగతి ప్లాట్లను, ఇండ్లను 22 ఎ నిషేధిత జాబితాలో  చేర్చి  వారి కష్టార్జితం ను లంచాల పేరిట  దండు కుంటు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశఅని ఇ ముఖ్యమంత్రి  గొప్పలు చెప్పుకోవడం  హాస్యపదం అని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ హైడ్రా బాధితులు, 22 ఎ బాధితుల పక్షాన అండగా ఉండి ఇ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుంది అని హెచ్చరించారుకాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ లు, 420 హామీలను అమలు చేయడం లో పూర్తిగా విఫలం  అయ్యింది  అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఆర్కేపురం అధ్యక్షుడు పెండ్యాల నాగేష్, నాయకులు న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, సాజీద్, గొడుగు శ్రీనివాస్, రాంనర్సింహా గౌడ్, కంచర్ల శేఖర్, వెంకటేష్ గౌడ్ , శ్యాం గుప్త, జగన్ మోహన్ రెడ్డి, ఊర్మిళ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, జాహేద్, బాలుశ్రీ, ముచింతల జగన్, శ్రీకాంత్ గౌడ్, వల్లూరి రమేష్, కపిల్, దీపక్, దశరథ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: