ఏపీలో జనసైనికుల వీరంగం.. నడిరోడ్డుపై బస్సు ఆపి హల్‌చల్

ఏపీలో జనసైనికుల వీరంగం.. నడిరోడ్డుపై బస్సు ఆపి హల్‌చల్

  • తాడేపల్లిగూడెంలో రోడ్డుపై బస్సు ఆపి డ్యాన్సులు.. ప్రయాణికులకు ఇబ్బందులు

Pawan Kalyan Fans: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు, అభిమానులు పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెంలో కొందరు జనసైనికులు రోడ్లపై హల్‌చల్ చేసినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సును నిలిపివేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేలా వేడుకలు నిర్వహించినట్లు సమాచారం.

బైకులతో స్టంట్లు చేస్తూ, ఆర్టీసీ బస్సు ఎక్కి డ్యాన్సులు చేస్తూ అభిమానులు సందడి చేశారు. జనసేన జెండాలను ప్రదర్శిస్తూ రోడ్డుపై నినాదాలు చేస్తూ హంగామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు బస్సులోని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

Read More దారి కోసం రైతుపై ఒత్తిడి.. ఎస్సై, ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించినప్పటికీ, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రోడ్లపై బస్సులు నిలిపివేయడం, బైక్ స్టంట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారి భద్రత, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.