మెడికో ప్రియాంక తండ్రి ఆవేదన.. “నా కూతురి బాధ ప్రభుత్వానికి కనిపించడం లేదా?”
“మా కూతురి పరిస్థితి పట్టించుకోరా?”.. మెడికో ప్రియాంక తండ్రి ఆవేదన
Medico Priyanka: మెడికో ప్రియాంక తండ్రి తన కూతురి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న తన కూతురిని అత్యంత దారుణంగా కారు ప్రమాదానికి గురిచేసి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఆమె పరిస్థితిపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తగిన స్థాయిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. “మైక్ కనిపిస్తే చాలు.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎం, డిప్యూటీ సీఎం, మరో ముఖ్యమైన మంత్రి, హోం మంత్రి గారికి ఈ తండ్రి ఆవేదన అర్థం కావడం లేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
తన కూతురికి ఎంతో భవిష్యత్ ఉందని, ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితిలో కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బాధ్యతాయుతంగా స్పందించాలని తండ్రి కోరుతున్నారు. రాజకీయ అంశాలపై ట్వీట్లు, ప్రెస్‌మీట్లు, ఖండనలు చేసే నాయకులు తన కూతురి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికో ప్రియాంకకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించి కుటుంబానికి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.