మహేశ్వరంలో పాఠశాలలను సందర్శించిన యూనిఫాం డైరెక్టర్ జాన్సన్
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని పలు పాఠశాలలను స్టేట్ సెర్ప్ డిపార్ట్‌మెంట్ యూనిఫాం డైరెక్టర్ జాన్సన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్, మహాత్మా జ్యోతిరావు పూలే, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్‌లకు సంబంధించి యూనిఫాం క్లాత్ సరఫరా, పాఠశాలల వారీగా కుట్టించిన యూనిఫాంల సంఖ్య, విద్యార్థులకు అందజేసిన వివరాలను పరిశీలించారు. అనంతరం మహేశ్వరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో యూనిఫాం నాణ్యత, కుట్టు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌తో కూడా యూనిఫాం పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో 455 మంది విద్యార్థినులకు రెండు జతల యూనిఫాంలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించి అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఏపీడీ జోజప్ప, డీపీఎంలు సునీల్ రెడ్డి, జయశ్రీ, మండల ఏపీఎం సంతోష్ కుమార్, సీసీలు తదితరులు పాల్గొన్నారు.