నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్ సి. నారాయణరెడ్డి
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణను ఆగస్టు 3లోగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ)కు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి గడువులోగా సమర్పించాలని తెలిపారు. ఓటరు జాబితాను ఖచ్చితంగా రూపొందించేందుకు చిరునామా మార్పులు, కొత్త ఓటర్లు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను ఎన్నికల సంఘం నవీకరిస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ పురోగతి 60.79 శాతంగా నమోదైనట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఇబ్రహీంపట్నం 68.87%, ఎల్బీనగర్ 50.75%, మహేశ్వరం 53.70%, రాజేంద్రనగర్ 55.40%, శేరిలింగంపల్లి 53.94%, చేవెళ్ల 77.44%, కల్వకుర్తి 85.66%, షాద్‌నగర్ 83.12 శాతం నమోదు అయ్యాయని వెల్లడించారు. ఆగస్టు 3లోగా ఫారాలు సమర్పించని వారి వివరాలు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలనకు గురవుతాయని, అవసరమైన ప్రక్రియ అనంతరం ఓటరు జాబితాలో పేరు కొనసాగకపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే బీఎల్‌ఓలను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.