కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డికి ఘనంగా నివాళులు 

విశ్వంభర, రామన్నపేట:  ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొంది కేంద్రంలో మంత్రి పదవులకు వన్నె తెచ్చి కోట్ల మంది హృదయాలలో నిలిచిన మహనీయుడు జైపాల్ రెడ్డిని భారతదేశ సమాజమంతా  గుర్తుపెట్టుకున్నదని, అంగవైకల్యం శరీరానికే కానీ జ్ఞానానికి కాదని నిరూపించిన మహనీయుడు, నిస్వార్థతతో చరిత్రలో నిలిచిన మహనీయునిగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చారని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన డాక్టర్ ఎన్.అశోక్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి ఏడవ వర్ధంతి సందర్భంగా శృతి వనం ఘాట్ లో ఆయనకు రాష్ట్ర దివ్యాంగుల సంఘాలు నివాళులు అర్పించాయి. అనంతరం డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి బాటలో దివ్యాంగులందరూ రాజకీయాలలో చైతన్యమై వారి బాటలో నడిచి తమ హక్కులను, ఆత్మ గౌరవాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళ సాధికారిక రాష్ట్ర అధ్యక్షురాలు కోళ్ల రాజ్యలక్ష్మి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ధోరపల్లి దానమ్మ, విశ్వవిద్యాలయాల ఫోరం సహాయ కార్యదర్శి మోదల సైదులు యాదవ్, మహిళా సాధికారిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.స్వప్న తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-former-union-minister-esjaypal-reddy/article-20094

Tags: