ప్రతి గడపకు కూటమిపాలన..  పాలచర్లలో ఇంటింటికి తెలుగుదేశం

విశ్వంభర, రాప్తాడు: రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా రాప్తాడు శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ, ఆదేశాలు మేరకు రాప్తాడు మండలం ఇంచార్జ్ ధర్మవరపు మురళి, సూచనల మేరకు రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, సీఎం రిలీఫ్ ఫండ్, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం తదితర పథకాల లబ్ధి ప్రజలకు అందుతున్నదా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ముత్యాలప్ప తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పరిపాలనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలతో కూడిన వాల్ పోస్టర్లను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గవ్వల నరేష్, వడ్డే గోవిందు, బూత్ కన్వీనర్ నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ పవన్, శ్రీమూర్తి, పాలు పెద్దన్నతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telugudesam-from-every-door-to-door-to-door-in-palachars/article-20102

Tags: