మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఘనంగా నివాళి
విశ్వంభర, హైదరాబాద్: దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌లో ఏర్పాటు చేసిన స్మారక స్థలంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి దేశ రాజకీయాల్లో, పార్లమెంటరీ వ్యవస్థలో అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ప్రజాసేవకు ఆయన చూపిన నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.