గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ నవీన్

గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ నవీన్

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలకు పరిష్కారంగా నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ నవీన్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జనాభా పెరుగుదల, కొత్త కాలనీల ఏర్పాటుతో విద్యుత్ వినియోగం పెరిగి లో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. లో వోల్టేజ్ కారణంగా టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర విద్యుత్ పరికరాలు దెబ్బతింటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ వోల్టేజ్ మెరుగుపడి గృహ వినియోగదారులు, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జొరల రమేష్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి సుజాత, గ్రామస్థులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sarpanch-naveen-is-the-target-of-village-development/article-20098

Tags: