సబ్సిడీ విత్తనాలు వెంటనే అందించాలి: బీజేపీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి

విశ్వంభర, అక్కన్నపేట: రైతులకు సబ్సిడీ విత్తనాలను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అక్కన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వానాకాలం సాగు సీజన్‌లో రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విత్తనాల కొరతతో రైతులు ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీంతో సాగు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు నాణ్యమైన సబ్సిడీ విత్తనాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ సమాచారం, ప్రభుత్వ పథకాల వివరాలను కేవలం వాట్సాప్ గ్రూపులకే పరిమితం చేయకుండా గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా రైతులకు చేరవేయాలని కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఐఆర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు, మాజీ సెన్సార్ బోర్డు సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమల రెడ్డి మండలంలోని పలు బూత్‌లను సందర్శించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎల్‌ఏ-2లు, బూత్ అధ్యక్షులు సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే 93 శాతం ఎన్యుమరేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు చెరుకు సంపత్, మడక రవికుమార్, జగదీశ్ చారి, అర్జున్ నాయక్, కళ్యాణ్ విష్ణు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/subsidized-seeds-should-be-provided-immediately-bjp-mandal-president-mahender/article-20078

Tags: