హెపటైటిస్ వ్యాధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో హెపటైటిస్ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ, హెపటైటిస్ అనేది కాలేయాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం, చికిత్స పొందడం ద్వారా దీనిని నియంత్రించవచ్చని తెలిపారు. ముఖ్యంగా హెపటైటిస్–బి వ్యాక్సిన్ తీసుకోవడం, పరిశుభ్రమైన ఆహారం మరియు తాగునీటిని వినియోగించడం, సురక్షిత రక్త మార్పిడి, సురక్షిత ఇంజెక్షన్ల వినియోగం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా హెపటైటిస్‌ను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు హెపటైటిస్ లక్షణాలపై అప్రమత్తంగా ఉండి, ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని అవసరమైన వైద్య సేవలను పొందాలని సూచించారు. హెపటైటిస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రాకేష్, డాక్టర్ జ్యోతిబాయి, డాక్టర్ సమీనా, వైద్య అధికారి డాక్టర్ రేఖ, ఆరోగ్య సిబ్బంది పాల్గొని హెపటైటిస్ వ్యాధి నివారణ, లక్షణాలు, చికిత్స, టీకాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి సమాచార కరపత్రాలను పంపిణీ చేసి ఆరోగ్య ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-awareness-program-on-hepatitis-disease/article-20084

Tags: