అధ్వాన్నంగా రామన్నపేట-భువనగిరి రహదారి

అధ్వాన్నంగా రామన్నపేట-భువనగిరి రహదారి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం గుండా వెళ్లే నల్గొండ, యాదాద్రి భువనగిరి రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి ప్రస్తుతం అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఈ మార్గంలో ఇంద్రపాలనగరం గ్రామం నుండి టేకుల సోమారం వరకు రహదారి అంతటా గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ రహదారి మరమ్మతులపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలకు దారితీస్తోంది. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అత్యవసర సేవల వాహనాలు సైతం వేగంగా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. టెండర్ ప్రక్రియ పనులు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొత్త రహదారి పనులు ప్రారంభమయ్యే వరకు కనీసం గుంతలను పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో ప్రమాదాలను కొంతవరకు నివారించడంతో పాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి, కొత్త రహదారి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ramannapet-bhuvanagiri-road-is-worse/article-20072

Tags: